Showing posts with label FlixMovies Updates. Show all posts
Showing posts with label FlixMovies Updates. Show all posts

 


గురువుగారూ..! ప్రభాస్ ఫ్యాన్స్‌తో పెట్టుకోకండీ..! కల్కి సినిమా హిట్ కాదంటుంటున్న వేణు స్వామి

సినీ సెలబ్రిటీల విడాకుల గురించి, అనారోగ్య సమస్యల గురించి చేస్తూ పాపులర్ అయ్యారు. ముఖ్యంగా సమంత నాగ చైతన్య జంట విడిపోతారు అని చెప్పి పెద్ద షాక్ ఇచ్చాడు. ఆయన చెప్పినట్టుగానే ఆ జంట విడిపోయారు. ఆతర్వాత కూడా చాలా మంది గురించి రకరకాల కామెంట్స్ చేశాడు. అంతే కాదు స్టార్ హీరోయిన్స్ ఈయనతో ప్రత్యేక పూజలు కూడా చేయించుకున్నారు .




ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి పేరు ఈ మధ్యకాలంలో తెగ వినిపిస్తుంది. ఈ పెద్దాయన సినిమా వాళ్ల జాతకాలు చెప్తూ పాపులర్ అయ్యారు. సినీ సెలబ్రిటీల విడాకుల గురించి, అనారోగ్య సమస్యల గురించి చేస్తూ పాపులర్ అయ్యారు. ముఖ్యంగా సమంత నాగ చైతన్య జంట విడిపోతారు అని చెప్పి పెద్ద షాక్ ఇచ్చాడు. ఆయన చెప్పినట్టుగానే ఆ జంట విడిపోయారు. ఆతర్వాత కూడా చాలా మంది గురించి రకరకాల కామెంట్స్ చేశాడు. అంతే కాదు స్టార్ హీరోయిన్స్ ఈయనతో ప్రత్యేక పూజలు కూడా చేయించుకున్నారు. రష్మిక మందన్న, డింపుల్ హయతిలాంటి హీరోయిన్స్ తో పాటు  అషు రెడ్డి, ఇనాయ సుల్తానాలాంటి మరికొంతమంది బుల్లితెర బ్యూటీస్ కూడా ఆయనతో పూజలు చేయించుకున్నారు. అయితే రీసెంట్ గా ఆయన చెప్పిన జ్యోతిష్యం బెడిసికొట్టింది.




ఇది కూడా చదవండి : Ramya Sri : బీ గ్రేడ్ సినిమాలో చేయమని ఆఫర్ చేశారు.. వాళ్ళందరూ పతివ్రతలు కాదు.. రమ్యశ్రీ బోల్డ్ కామెంట్స్

ఏపీ రాజకీయాలపై ఆయన చెప్పిన జ్యోతిష్యం తప్పు కావడంతో వేణుస్వామిని ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు నెటిజన్స్. దాంతో ఇక పై రాజకీయాల గురించి జ్యోతిష్యం చెప్పను అని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు వేణు స్వామి. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి కామెంట్స్ చేశారు వేణుస్వామి. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు డిజాస్టర్ అయినప్పుడు నాకు ఎవ్వరూ దండలేయలేదు అన్నారు. అలాగే కల్కి పై కూడా కామెంట్స్ చేశారు.

బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కు హిట్ అనేది రాదని అన్నారు మరి ఇప్పుడు కల్కి సినిమా హిట్ అయ్యింది ఏమంటారు.? అని ప్రశ్నించగా.. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ డిజాస్టర్ అయ్యాయి.. అప్పుడు నాకు ఎవ్వరూ దండలేసి కిరీటాలు పెట్టలేదు. అలాగే సలార్ సినిమా హిట్ అంటూ ఫ్యాన్స్ తెగ ఎగిరారు. ఆ సినిమా నిజంగా హిట్ అయ్యిందా.? ఆ సినిమాకు 130కోట్లు లాస్ వచ్చింది. ఇప్పుడు కల్కి హిట్ అంటున్నారు. ఆ సినిమాలో హీరో ఎవరు.? ప్రభాస్ ఎంత సేపు కనిపించాడు.? అసలు ఆ సినిమా హిట్టా.? నిర్మాతకు ఎంత డబ్బులు వస్తాయో చూద్దాం.! ప్రభాస్ మిర్చి, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు చేయగలడా.? అలాంటి పరిస్థితి లేదు అని విమర్శలు చేశారు వేణుస్వామి. ఇప్పుడు ఈ కామెంట్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.


 

Tollywood: ఈ చిన్నారి ఒక్క వాసెలిన్ యాడ్‌తో హీరోయిన్ అయింది.. ఎవరో గుర్తుపట్టగలరా ?

ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి 12వ తరగతిలో టాపర్. అంతేకాదు.. IAS ఆఫీసర్ కావాలనుకుంది. కట్ చేస్తే ఇప్పుడు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో తెలుసా.. ? కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. అలాగే వాణిజ్య ప్రకటనలలోనూ మెరిసింది. ఈ అమ్మాయి చేసిన వాసెలిన్ యాడ్ లో నటించింది.




సాధారణంగా సినీ పరిశ్రమలో చాలా మంది తారలు గమ్యం వేరుగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి తాము నిర్ణయించుకున్న లక్ష్యాలను కాకుండా మరోదారిని ఎంచుకున్నట్లు చెబుతారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోయిన్స్ తాము ఎప్పుడూ నటిగా మారాలని అనుకోలేదని.. కానీ అనుకోకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టామని అంటారు. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి 12వ తరగతిలో టాపర్. అంతేకాదు.. IAS ఆఫీసర్ కావాలనుకుంది. కట్ చేస్తే ఇప్పుడు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో తెలుసా.. ? కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. అలాగే వాణిజ్య ప్రకటనలలోనూ మెరిసింది. ఈ అమ్మాయి చేసిన వాసెలిన్ యాడ్ లో నటించింది. ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తుంది. తనే హీరోయిన్ రాశీ ఖన్నా.


తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు రాశీ ఖన్నా. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రాశీఖన్నా.. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల హృదయాలు దోచేసింది. అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోస్ సరసన అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ ఈ బ్యూటీకి స్టార్ హీరోల మూవీలో అవకాశాలు మాత్రం రాలేదు. తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో మెరిసిన ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారింది. ఇటీవలే సిద్ధార్థ్ మల్హోత్రా సరసన యోధ సినిమాలో కనిపించింది.




నిజానికి రాశీ ఖన్నా తన సినీ ప్రయాణాన్ని హిందీ సినిమాతోనే ప్రారంభించింది. జాన్ అబ్రహం నటించిన మద్రాస్ కేఫ్ సినిమాతోనే నటిగా పరిచయమైంది. ఈ మూవీలో రాశీ ఖన్నా పోషించిన పాత్ర చాలా చిన్నది. ఆ తర్వాత ఈ బ్యూటీకి తెలుగు, తమిళంలో భాషలలో వరుస ఆఫర్స్ వచ్చాయి. ఇక ఇటీవలే అరణ్మనై 4 చిత్రంలో నటించింది. ప్రస్తుతం తమిళంలో ది సబర్మతి రిపోర్ట్ మూవీతోపాటు.. తలాఖోన్ మే ఏక్ వంటి చిత్రాల్లో నటిస్తుంది. ఇక తెలుగులో తెలుసు కదా మూవీలో నటిస్తుంది.





 

స్టేజ్ పైనే రచ్చ రచ్చ.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌పై ఫైర్ అయిన కాంట్రవర్సీ లేడీ


ముగ్గురిని పెళ్లి చేసుకొని అందరిని షాక్ కు గురి చేసింది. అంతే కాదు చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. అంతే కాదు ఆమెను తన ఫ్యామిలీ కూడా దూరం పెట్టేసింది. బయటకు వచ్చిన తర్వాత తన తండ్రి పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తనకు రావాల్సిన వాట ఇవ్వకుండా తనకు అన్యాయం చేశాడని ఆరోపించింది వనిత విజయ్ కుమార్. ఈ కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి.



సీనియర్ నటుడు విజయ్ కుమార్ కూతురు వనిత విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది ఈ చిన్నది. చాలా కాంట్రవర్సీల్లో ఇరుక్కుంది వనిత విజయ్ కుమార్. ఏకంగా ముగ్గురిని పెళ్లి చేసుకొని అందరిని షాక్ కు గురి చేసింది. అంతే కాదు చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. అలాగే ఆమెను తన ఫ్యామిలీ కూడా దూరం పెట్టేసింది. బయటకు వచ్చిన తర్వాత తన తండ్రి పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తనకు రావాల్సిన వాట ఇవ్వకుండా తనకు అన్యాయం చేశాడని ఆరోపించింది వనిత విజయ్ కుమార్. ఈ కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. అలాగే ఆమధ్య బిగ్ బాస్ హౌస్ లోనూ పాల్గొంది ఆమె. వీటితోపాటు కొన్ని టీవీ షోల్లోనూ పాల్గొంది. ఇదిలా ఉంటే వనిత విజయ్ కుమార్ ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పై మండిపడింది.




ఇది కూడా చదవండి : Ramya Sri : బీ గ్రేడ్ సినిమాలో చేయమని ఆఫర్ చేశారు.. వాళ్ళందరూ పతివ్రతలు కాదు.. రమ్యశ్రీ బోల్డ్ కామెంట్స్

చంద్రలేఖ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన వనిత విజయ్ కుమార్. దేవి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. కోడిరామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. కానీ అనుకోకుండా ఆమె పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. ఆతర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. ఇక బుల్లితెరపై మాత్రం సందడి బాగానే చేసింది.

అయితే ఓ డాన్స్ షోలో ఆమె కంటెస్టెంట్ గా పాల్గొంది ఆ షోలో స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ జడ్జ్ గా వ్యవహరించారు. అయితే ఈ ఇద్దరి మధ్య పెద్ద వాగ్వాదామే జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రమ్యకృష్ణతో జరిగిన గొడవ గురించి మాట్లాడింది వనిత విజయ్ కుమార్. సదరు డాన్స్ షోలో వనిత కాళికా మాత వేషంలో డాన్స్ చేసింది. అయితే మేకప్ బాగుంది కానీ డాన్స్ అంతగా బాలేదు అని రమ్యకృష్ణ కామెంట్ చేశారు. దాంతో వనిత ఆగ్రహం వ్యక్తం చేసింది .  జడ్జ్‌మెంట్ ఇవ్వకుండా మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని చెబుతున్నారంటూ.. వేరేవాళ్లతో పోల్చుతున్నారేంటీ..? అంటూ మండిపడింది. ఆతర్వాత వనిత కోపంతో అక్కడ నుంచి వెళ్ళిపోయింది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. రమ్యకృష్ణ తనకు చిన్నప్పటి నుంచి తెలుసు అని.. ఆమె మంచి నటి అని ప్రశంసించింది.అలాగే ఆమెతో ఎలాంటి గొడవలు లేవని.. కేవలం ఆమె చెప్పిన జడ్జ్‌మెంట్ నచ్చలేదు అని తెలిపింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.


 

Film News: బాక్స్ ఆఫీస్ కి చుక్కలు చూపిస్తున్న కల్కి.. మహేష్ ప్రశంస..


కల్కి 2898 ఏడీ జోరు కొనసాగుతోంది. దేశ విదేశాల్లో భారీ వసూళ్లు సాధిస్తోంది. కల్కి ఓ అద్భుతం. జస్ట్ వావ్‌ అనిపించిందని అన్నారు హీరో మహేష్‌.  గత కొన్ని రోజులుగా తనపై జరుగుతున్న ప్రచారం వల్ల తాను తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతున్నానని అన్నారు నటి హేమ. యంగ్ హీరో మంచు మనోజ్ తన కూతురి పేరును ప్రకటించారు.  తన యాబైవ చిత్రం కోసం ఎంతో రిస్క్ చేశారు హీరోయిన్ అంజలి.


కల్కి 2898 ఏడీ జోరు కొనసాగుతోంది. దేశ విదేశాల్లో భారీ వసూళ్లు సాధిస్తోంది. తాజాగా ఈ సినిమా 900 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసినట్టుగా వెల్లడించారు మేకర్స్. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపిక పదుకోన్ కీలక పాత్రల్లో నటించారు.





1 / 3




కల్కి ఓ అద్భుతం. జస్ట్ వావ్‌ అనిపించిందని అన్నారు హీరో మహేష్‌. నాగ్‌ అశ్విన్‌ విజన్‌కి హ్యాట్సాఫ్ అని అన్నారు సూపర్‌స్టార్‌. ప్రతి ఫ్రేమ్‌ కళాఖండంలా ఉందని అన్నారు. అమితాబ్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్ కి ఎవరూ సరితూగరని ప్రశంసించారు. కమల్‌హాసన్‌ ప్రతి పాత్రకూ జీవం పోస్తారని, ప్రభాస్‌ సునాయాసంగా నటించారని అన్నారు మహేష్‌.




2 / 3




తన యాబైవ చిత్రం కోసం ఎంతో రిస్క్ చేశారు హీరోయిన్ అంజలి. ప్రస్తుతం అశోక్ దర్శకత్వంలో ఈగై అనే సినిమాలో నటిస్తున్నారు ఈ బ్యూటీ. ఈ సినిమాలో యాక్షన్‌ సీన్‌లో భాగంగా 16 అడుగుల ఎత్తు నుంచి దూకాల్సి ఉండటంతో, డూప్‌ లేకుండా తానే స్వయంగా ఆ జంప్ చేశారు అంజలి.


3 / 3



 


Movie Updates: బులెట్ స్పీడ్ లో బాలయ్య.. వేట్టయాన్‌ కోసం ఫాహద్‌ ఫాజిల్‌..



బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. రామ్‌చరణ్ పవర్‌హౌస్‌లాంటి వ్యక్తి అని అన్నారు శంకర్‌. రవి సిరోర్‌, నివిష్క పాటిల్‌ జంటగా నటించిన సినిమా 'ఎవరు ఎందుకు'. అల్లరి నరేష్‌ హీరోగా నటించిన సినిమా బచ్చలమల్లి. రజనీకాంత్‌, అమితాబ్‌, రానా, మంజువారియర్‌, ఫాహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రల్లో నటించిన సినిమా వేట్టయాన్‌.


బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఇటీవలే మొదలైన షెడ్యూల్‌ తాజాగా పూర్తయింది. బాలయ్యతో పాటు మిగిలిన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. వారం రోజుల తర్వాత మరో షెడ్యూల్‌ మొదలుకానుంది. దాదాపు 15 రోజుల పాటు సాగుతుంది.




1 / 4



రామ్‌చరణ్ పవర్‌హౌస్‌లాంటి వ్యక్తి అని అన్నారు శంకర్‌. ఆయనలోని కంట్రోల్డ్ పవర్‌ని గేమ్‌ చేంజర్‌లో చూడొచ్చని చెప్పారు. చరణ్‌ పార్టు చిత్రీకరణ పూర్తయిందని అన్నారు. చరణ్‌లాంటి హీరోతో పనిచేయడం ఆనందంగా ఉందని అన్నారు శంకర్‌. భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్లో ఈ విషయాలను చెప్పారు.




2 / 4




అల్లరి నరేష్‌ హీరోగా నటించిన సినిమా బచ్చలమల్లి. రాజేష్‌ దండా, బాలాజీ గుత్తా సంయుక్తంగా నిర్మించారు. అమృత అయ్యర్‌ నాయిక. ఈ సినిమా షూటింగ్‌ ముగింపు దశలో ఉంది. తాజాగా డబ్బింగ్‌ పనులకు శ్రీకారం చుట్టింది టీమ్‌. రా అండ్‌ రస్టిక్‌ కథాంశంతో తెరకెక్కుతున్నట్టు చెప్పారు మేకర్స్.




3 / 4




రజనీకాంత్‌, అమితాబ్‌, రానా, మంజువారియర్‌, ఫాహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రల్లో నటించిన సినిమా వేట్టయాన్‌. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. తాజాగా ఫాహద్‌ ఫాజిల్‌ తన కేరక్టర్‌కి డబ్బింగ్‌ చెప్పడం మొదలుపెట్టారు. అక్టోబర్‌ 10న విడుదల కానుంది వేట్టయాన్‌. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కెరీర్లో మరో రేంజ్‌ సినిమా అవుతుందని అన్నారు మేకర్స్.

4 / 4




 

Mirzapur 3: మీర్జాపూర్ 3లో రెచ్చిపోయిన సలోని భాబీ ఎవరో తెలుసా.. ? కుర్రాళ్ల హృదయాలను దొచేసిన నేహా..


ప్రస్తుతం ఓ సినీతార గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. ఈ ఒక్క సిరీస్ ద్వారా ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఈ బ్యూటీ పేరు మారుమోగుతుంది. ఇక ఇప్పుడు ఈ తారకు ఇన్ స్టా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా..? మీర్జాపూర్ వెబ్ సిరీస్ సీజన్ 3లో దద్దా త్యాగి కోడలు సలోని త్యాగి పాత్రలో నటించిన నేహా సర్గమ్. ఈ సిరీస్ లో దద్దా త్యాగి పెద్ద కొడుకు భరత్ త్యాగి భార్యగా కనిపించింది.




మీర్జాపూర్ 3 వెబ్ సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతుంది. ఈ సిరీస్ ద్వారా ఇప్పటివరకు చాలా మంది సినీతారలకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమలో అడుగుపెడుతున్న తారలకు పాపులారిటీని తీసుకువచ్చింది మీర్జాపూర్ సిరీస్. ఈక్రమంలోనే ప్రస్తుతం ఓ సినీతార గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. ఈ ఒక్క సిరీస్ ద్వారా ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఈ బ్యూటీ పేరు మారుమోగుతుంది. ఇక ఇప్పుడు ఈ తారకు ఇన్ స్టా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా..? మీర్జాపూర్ వెబ్ సిరీస్ సీజన్ 3లో దద్దా త్యాగి కోడలు సలోని త్యాగి పాత్రలో నటించిన నేహా సర్గమ్. ఈ సిరీస్ లో దద్దా త్యాగి పెద్ద కొడుకు భరత్ త్యాగి భార్యగా కనిపించింది.


సలోని త్యాగి పాత్రలో నటించిన బ్యూటీ నేహా సర్గమ్. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగిపోయింది. మీర్జాపూర్ 3 సిరీస్ ద్వారా ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయ్యింది. బీహార్‌లోని పాట్నాకు చెందిన నేహా.. అసలు పేరు నేహా దూబే. పాట్నాలో చదువు పూర్తయ్యాక తల్లి, చెల్లితో కలిసి ముంబై షిఫ్ట్ అయ్యింది. సినీ పరిశ్రమలో సింగర్ కావాలనుకుంది. ఈ క్రమంలోనే ఇండియన్ ఐడల్ సీజన్ 4లో పాల్గొంది. కానీ అదే సమయంలో గొంతు ఇన్ఫెక్షన్ కారణంగా ఆ షో నుంచి బయటకు వచ్చింది.

ఆ తర్వాత రాజన్ షాహి తన సీరియల్లో నేహాకు పిలిచి మరీ ఆఫర్ ఇచ్చారు. కానీ నేహా తల్లిదండ్రులకు ఆమె నటిగా మారడం ఇష్టం లేదు. అలాంటి పరిస్థితులలో రాజన్ షాహి స్వయంగా నేహా ఇంటికి వచ్చి ఆమె తల్లిదండ్రులను ఒప్పించడంతో చాంద్ చూపా బాదల్ మే సీరియల్ లో నటించింది. ఆ తర్వాత చాలా కాలం బ్రేక్ తీసుకున్న నేహా.. 2012లో రామాయణ్: సబ్కే జీవన్ కా ఆధార్ సీరియల్ లో సీత పాత్రలో నటించింది. ఘుమ్ హై కిసీ కే ప్యార్ మే సీరియల్లో నటించిన నటుడు నీల్ భట్ కూడా రామాయణ్ సీరియల్లో నటించాడు. ఈ సీరియల్ సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో మూడేళ్లు రిలేషన్ షిప్ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు.

నేహా సర్గమ్ పౌరాణిక షోలలోనే ఎక్కువగా నటించింది. రామాయణ్, యశోమతి మైయా, పరమావతార్ శ్రీకృష్ణ వంటి సీరియల్స్ లో నటించింది. ఇక ఇప్పుడు మీర్జాపూర్ 3 ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది.


మరిన్ని సినిమా వార్తల కోసం ఛానల్ ఫాలో అవ్వండి.


 

Bahishkarana Trailer: అమ్మబాబోయ్..! అంజలి అదరగొట్టేసింది.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న బహిష్కరణ ట్రైలర్:


మంచోడు చేసే త‌ప్పేంటో తెలుసా.. చెడ్డోడి చ‌రిత్ర గురించి తెలుసుకోవ‌టం అనే డైలాగ్‌తో ప్రారంభ‌మైంది. ఓ వైపు ప‌చ్చ‌టి ప‌ల్లెటూరు, అక్క‌డ అంజ‌లి, శ్రీతేజ్‌, అన‌న్య నాగ‌ళ్ల పాత్రల మ‌ధ్య స‌న్నివేశాల‌ను అందంగా చూపిస్తూనే, ప‌ల్లెటూరులో ఊరి పెద్ద‌, అత‌ని మ‌నుషులు చేసే దురాగ‌తాల‌ను చూపించారు.. అలాంటి ప‌ల్లెటూర్లోకి పుష్ప అనే అమ్మాయి వ‌స్తుంది.




యాబైకి పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా, విలక్షణ పాత్రల్లో మెప్పించిన నటి అంజలి. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో జీ 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందుతోన్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. ముఖేష్ ప్రజాపతి ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్‌లో రూపొందుతోన్న ఈ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉండనున్నాయి. ఈ వెబ్ సిరీస్ జూలై 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైల‌ర్‌ను టాలీవుడ్ కింగ్ నాగార్జున విడుద‌ల చేశారు. ట్రైల‌ర్‌ను గమనిస్తే..

మంచోడు చేసే త‌ప్పేంటో తెలుసా.. చెడ్డోడి చ‌రిత్ర గురించి తెలుసుకోవ‌టం అనే డైలాగ్‌తో ప్రారంభ‌మైంది. ఓ వైపు ప‌చ్చ‌టి ప‌ల్లెటూరు, అక్క‌డ అంజ‌లి, శ్రీతేజ్‌, అన‌న్య నాగ‌ళ్ల పాత్రల మ‌ధ్య స‌న్నివేశాల‌ను అందంగా చూపిస్తూనే, ప‌ల్లెటూరులో ఊరి పెద్ద‌, అత‌ని మ‌నుషులు చేసే దురాగ‌తాల‌ను చూపించారు.. అలాంటి ప‌ల్లెటూర్లోకి పుష్ప అనే అమ్మాయి వ‌స్తుంది. ఆమె వ‌చ్చిన త‌ర్వాత అక్క‌డి పరిస్థితులు మారుతాయి. ఇంత‌కీ పుష్ప అక్క‌డికెందుకు వ‌చ్చింది.. ఊరి పెద్ద‌తో ఆమెకున్న రిలేష‌న్ ఏంటి.? అమ్మాయిల‌ను ఆట‌వ‌స్తువులుగా చూసింది ఎవ‌రు.? ఇలాంటి ఎన్నెన్నో ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం బ‌హిష్క‌ర‌ణ సీరీస్‌.

అంజ‌లి పాత్ర‌ను గ‌మనిస్తే.. ఓ వైపు ప్రేమ కురిపిస్తూనే మ‌రో వైపు ఆగ్ర‌హావేశంతో ఊగిపోయే ఆమె పాత్ర‌ను చూస్తుంటే అంజలీ పోషించిన పాత్ర‌లోని భావోద్వేగాలు ఎంత లోతుల్లో ఉన్నాయో అర్థ‌మ‌వుతుంది. శ్రీతేజ్‌, అన‌న్య నాగ‌ళ్ల పాత్ర‌ల‌తో పాటు ఊరి పెద్ద పాత్ర‌లో ర‌వీంద్ర‌న్ విజ‌య్‌ను చూడొచ్చు. ప్ర‌శాంతంగా ఉండే ఆ ప‌ల్లెటూరుకి అమ్మాయి ఎందుకు వ‌చ్చింది.. ఆమెకు అక్క‌డ ఎదురైన ప‌రిస్థితులేంటి? ఆమె ఎవ‌రిపై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌నుకుంది.. ఎందుకు? అనే విష‌యాలు తెలియాలంటే జూలై 19న జీ5లో స్ట్రీమింగ్ కానున్న‌ ‘బహిష్కరణ’ సిరీస్ చూడాల్సిందే. ట్రైల‌ర్‌లో ప్ర‌తి విజువ‌ల్‌, ప్ర‌తి మాటా సీరీస్ గురించి లోతుగా ఏదో చెప్పే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంది. ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా క‌ట్ చేశారు ట్రైల‌ర్‌ని. జూలై 19 ఎప్పుడెప్పుడు వ‌స్తుందా? సీరీస్‌ని ఎంత త్వ‌ర‌గా చూద్దామా అని ఎదురుచూసేవారి సంఖ్య పెరుగుతూ ఉంది.








 

Ramya Sri : బీ గ్రేడ్ సినిమాలో చేయమని ఆఫర్ చేశారు.. వాళ్ళందరూ పతివ్రతలు కాదు.. రమ్యశ్రీ బోల్డ్ కామెంట్స్:


హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆమె ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసి మెప్పించింది. ఎక్కవగా ఆమె బోల్డ్ క్యారెక్టర్స్ చేసి ఆకట్టుకుంది. చాలా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లోనూ మెరిశారు రమ్యశ్రీ. ఆమె అసలు పేరు సుజాత. సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత చాలా మంది అదే పేరుతో ఉండటంతో రమ్యశ్రీగా పేరు మార్చుకుంది.


రమ్యశ్రీ..  చాలా మందికి ఈ భామ గురించి తెలియకపోవచ్చు కానీ చూస్తే ఈమేనా అని ఇట్టే గుర్తుపట్టిస్తారు. నటిగా చాలా సినిమాల్లో చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది రమ్య శ్రీ. హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆమె ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసి మెప్పించింది. ఎక్కవగా ఆమె బోల్డ్ క్యారెక్టర్స్ చేసి ఆకట్టుకుంది. చాలా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లోనూ మెరిశారు రమ్యశ్రీ. ఆమె అసలు పేరు సుజాత. సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత చాలా మంది అదే పేరుతో ఉండటంతో రమ్యశ్రీగా పేరు మార్చుకుంది. తెలుగు అమ్మాయి అయిన రమ్యశ్రీ కన్నడ ఇండస్ట్రీలో మొదటిగా నటించింది. కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా 30కి పైగా సినిమాల్లో నటించింది రమ్యశ్రీ. కన్నడ, తమిళ, మళయాల, హిందీ, భోజ్ పురి భాషలలో 250 చిత్రాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ.


రమ్యశ్రీ ఎక్కువగా శృంగార రస పాత్రలను పోషిస్తుంటుంది. నువ్వు నేను, ఆది, సింహాద్రి, యమగోల మళ్ళీ మొదలయింది లాంటి చిత్రాల్లో రమ్యశ్రీ నటించింది. అయితే బోల్డ్ పాత్రలు చేయడంతో ఆమె చాలా విమర్శలు కూడా ఎదుర్కొంది. అలాగే బోల్డ్ రోల్స్ చేయడం వల్ల చాలా మంది తనను తప్పుడు ఉద్దేశంతో చూశారని తెలిపింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కారులో తనను బలవంతం చేయబోయారని తెలిపింది.

ఆమె మాట్లాడుతూ.. నన్ను ఈవెంట్స్ కు పిలవలనుకున్నా ఆమె బట్టలు సరిగ్గా వేసుకోదు ఎందుకు అని కామెంట్స్ కూడా చేశారట. అమెరికాలో ఓ ఈవెంట్ కోసం ముందుగా రమ్యను పిలిచారట.. ఆతర్వాత ఆమె అసభ్యకరంగా బట్టలు వేసుకుంటుని అని ఆమెను వద్దు అనుకున్నారట.. ఆతర్వాత కొంతమంది బట్టల్లో ఏముంది ఇక్కడ మనం వేసుకోవడం లేదా అని సపోర్ట్ గా మాట్లాడి తనను ఇన్వైట్ చేశారు అని తెలిపింది. ఆ తర్వాత అక్కడ నన్ను చూసి అంతా షాక్ అయ్యారు. సినిమాల్లో అంత బోల్డ్ గా ఉంటారు బయట చాలా డీసెంట్ గా ఉన్నారు అని షాక్ అయ్యారు. ఓ పెద్దాయన నన్ను ఉద్దేశిస్తూ.. చీర కట్టిన ప్రతి ఆడది పతివ్రత కాదు అని చెప్పాడు. డ్రెస్ ని చూసి అంచనా వేయకూడదు అని అన్నారు అని తెలిపింది. అలాగే తనకు బీ గ్రేడ్ సినిమాలో నటించమని కూడా ఆఫర్స్ వచ్చాయి అని తెలిపింది. నీలి చిత్రాల్లో నటించమని నాపై చాలా మంది ఒత్తిడి తెచ్చారు. నేను అలాంటి సినిమాలు చేయను అని గట్టిగా వాదించాను. సినిమాల్లో దర్శకులు చెప్పారని పొట్టి బట్టలు వేసుకుంటాను అంతమాత్రానా అలాంటి సినిమాలు చేయను అని అన్నారు రమ్య శ్రీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఛానల్ ఫాలో అవ్వండి.


 


Thangalaan Trailer : అదరగొట్టిన విక్రమ్.. ఎట్టకేలకు తంగలాన్ ట్రైలర్ వచ్చేసింది..

ఎట్టకేలకు ఈ సినిమానుంచి ట్రైలర్ విడుదలైంది. సినిమా ట్రైలర్ మిస్టీరియస్‌గా, మిస్టరీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది, ఇప్పుడు ఈ ఆసక్తికరమైన ట్రైలర్ దానిని మరో స్థాయికి తీసుకెళ్లింది. ట్రైలర్ చియాన్ విక్రమ్ అద్భుతమైన నటన మెప్పిస్తుంది. ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా కనిపించనున్నాడు విక్రమ్.




చియాన్ విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తంగలాన్’. ఈ సినిమా కోసం ప్రేక్షకులు. విక్రమ్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమానుంచి ట్రైలర్ విడుదలైంది. సినిమా ట్రైలర్ మిస్టీరియస్‌గా ఉంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది, ఇప్పుడు ఈ ఆసక్తికరమైన ట్రైలర్ దానిని మరో స్థాయికి తీసుకెళ్లింది. ట్రైలర్ లో చియాన్ విక్రమ్ మరోసారి తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు విక్రమ్. ఈ సినిమాలో పార్వతి, మాళవిక మోహన్‌, పశుపతి ముఖ్యపాత్రలు పోషించారు. పా.రంజిత్‌ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిందని తెలుస్తోంది. సర్పత్త పరంబరై, కబాలి, కాలా వంటి హిట్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న పా.రంజిత్ మరోసారి విభిన్నమైన, విలక్షణమైన చిత్రాన్ని రూపొందించారు. ట్రైలర్ చూశాక సినిమాలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో పెరిగింది.

అయితే సినిమా కథ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KFG)  చరిత్ర గురించి ఉంటుంది. 200 సంవత్సరాల క్రితం, బ్రిటీష్ వాళ్లు కోలార్ బంగారు గని క్షేత్రాన్ని కనుగొన్నారు. దానిని తమకు అనుకూలంగా ఉపయోగించుకున్నారు. ఆ సమయంలో జరిగిన కథ ఇది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్. టీజర్ తంగలాన్ పై ఆసక్తిని కలిగించాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తంగలాన్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో విజువల్స్ తోనే భయపెట్టించారు మేకర్స్. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. 2024 ఆగస్టు 15న హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది ఈ సినిమా . మరి ఈ సినిమాతో విక్రమ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.







మరిన్ని సినిమా వార్తల కోసం ఛానల్ ఫాలో అవ్వండి.


Picking just a few from a year packed with exciting releases, here are some of the most anticipated Indian films of 2024:

  • Singham Again: The return of everyone's favorite police officer Singham, played by Ajay Devgn,
    promises another round of thrilling action and powerful dialogues

    Image of Singham Again movie poster  www.instagram.com
  • Kanguva: This period action drama has generated a lot of buzz for its scale and intriguing story. Suriya takes on 13 different looks in this film alongside Disha Patani and Bobby Deol

    Image of Kanguva movie poster  www.imdb.com
  • Fighter: Directed by Siddharth Anand, this action film brings together Hrithik Roshan and Deepika Padukone for the first time. With high production values and a sizzling lead pair, Fighter is generating a lot of excitement.

  • Image of Fighter movie poster  www.imdb.com
  • Pushpa: The Rule (Part 2): The sequel to the blockbuster Pushpa, this film will see Allu Arjun reprise his role as the stylish smuggler Pushpa Raj. With the first part ending on a cliffhanger, fans are eagerly waiting to see what unfolds next.

    Image of Pushpa: The Rule movie poster www.reddit.com
  • Kalki: A sci-fi film set in 2898 AD, Kalki has piqued the interest of moviegoers with its futuristic setting and unique storyline.

This is just a small sampling of the many great Indian films that are scheduled to release in 2024. With a variety of genres and star power, there's something for everyone to look forward to!


How to play Video: For Play movie Click on Player Icon 2 or 3 Times Until Movie Starts. Because Some Useless tab or windows  opened just close  them they are ADS.

                                For fastest Buffering pause it for 5-10 minutes then continue playing
                                                Share This Movie With Friends And Family...





credits to telugucinema.com
 

Click Hera Earn More

Senapathy is a former independence warrior who now battles corruption as a vigilante. Senapathy comes home to support a young man who has been using internet videos to expose dishonest politicians in the nation.


Director - S. Shankar

Writers - G. ChandrasekharJayamohanVamsy Krishna

Stars - Kamal HaasanRakul Preet SinghKajal Aggarwal


Click Hear Earn More

credits to IMDb


 Vinod Rawat, the director of "Pushtaini," and his acting coach Hrithik Roshan have an open discussion regarding Vinod's debut feature film. This interview has Vinod Rawat discussing his path from persuading his family to work on the film, the meaning of 'Pushtaini' and how his personal life influences it, to how a desire and some reflection helped him create his first film. In addition, they discuss the ins and outs of acting, the influence of casting in films, the value of intuition and personal relationships in character development, and much more! See this raw interview to find out more about the making of "Pushtaini," how Hrithik Roshan was influenced by it, what direction lessons Vinod Rawat learned from Hansal Mehta and Ram Madhvani, and how Hrithik Roshan has impacted Vinod Rawat over the years!



credits to IMDb


 

credits to LatestLY


Akshay Kumar's films might be delivering punches on screen, but is his production buddy Vashu Bhagnani facing a knockout? Reports claim Bhagnani's Pooja Entertainment owes big bucks to the director and crew of "Mission Raniganj" starring Khiladi Kumar himself.

Remember "Bade Miyan Chote Miyan's" box office disaster? Bhagnani reportedly had to sell his office to make ends meet Could Khiladi Kumar's hefty fees be part of the problem? Some critics say his ₹100 crore paychecks aren't justified by the films' performance

But hold on! Bhagnani denies these rumors ‍♂️ He says there's no debt and no employee layoffs! So, who to believe? Is this a publicity stunt for their upcoming film? Or is there real trouble in paradise?



One thing's for sure, this Bollywood story is getting SPICY ️ Stay tuned for more updates! #AkshayKumar #VashuBhagnani #FinancialTroubles #BollywoodNews.





అక్షయ్ కుమార్ చిత్రాలు తెరపై బలంగా ఉన్నప్పటికీ, అతని ప్రొడక్షన్ భాగస్వామి వాషు భగ్నానీ ఎదుర్కొంటున్నది ఓ నాక్‌ఔట్ అనిపిస్తోందా? "మిషన్ రణిగంజ్" దర్శకుడు మరియు సిబ్బందికి భగ్నానీ యొక్క పూజ ఎంటర్టైన్మెంట్ పెద్ద మొత్తం చెల్లించాల్సి ఉందని నివేదికలు చెబుతున్నాయి, ఈ చిత్రంలో ఖిలాడీ కుమార్ నటించారు.


"బడే మియాన్ చిన్నే మియాన్" బాక్సాఫీస్ విఫలమైంది, భగ్నానీ తన ఆఫీస్‌ను విక్రయించాల్సి వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఖిలాడీ కుమార్ యొక్క భారీ పారితోషికం ఈ సమస్యకు కారణమని కొందరు విమర్శకులు అంటున్నారు. అతని ₹100 కోట్ల పారితోషికం ఈ చిత్రాల పనితీరికిన తగినంత కాదని అంటున్నారు.


కానీ ఆగండి! భగ్నానీ ఈ రూమర్లను ఖండించారు. ఆయన చెబుతున్నది ఏమిటంటే, ఎలాంటి ఋణం లేదా ఉద్యోగుల తొలగింపులు లేవని! మరి, ఎవరి మాట నమ్మాలి? ఇది వారి రాబోయే చిత్రానికి పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనా? లేక నిజంగా పరిష్కారం లో సమస్య ఉందా?


**పబ్లిసిటీ స్టంట్ అనిపిస్తోందా?**  

కొంతమంది అభిమానులు, ఇది వారి రాబోయే చిత్రానికి ప్రాచుర్యం పొందడానికి చేయబడిన చర్య అని భావిస్తున్నారు. ఈ తరహా పబ్లిసిటీ స్టంట్లు చిత్ర పరిశ్రమలో సర్వసాధారణం.


**నిజంగా సమస్య ఉందా?**  

అయితే, కొందరు విమర్శకులు నిజంగా పూజ ఎంటర్టైన్మెంట్ ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుందని, అలాగే భారీ పారితోషికాలు కూడా సమస్యను పెంచుతున్నాయని అంటున్నారు.

ఒక విషయం మాత్రం ఖాయం, ఈ బాలీవుడ్ కథ మరింత రుచికరంగా మారుతోంది! 

Stay tuned for more updates!

#AkshayKumar #VashuBhagnani #FinancialTroubles #BollywoodNews.



अक्षय कुमार की फिल्में पर्दे पर तो जबरदस्त एक्शन दिखा रही हैं, लेकिन क्या उनके प्रोडक्शन पार्टनर वाशु भगनानी नॉकआउट की कगार पर हैं? खबरें आ रही हैं कि भगनानी की पूजा एंटरटेनमेंट पर "मिशन रानीगंज" के डायरेक्टर और क्रू का काफी पैसा बकाया है, जिसमें खुद खिलाड़ी कुमार मुख्य भूमिका में हैं।


याद है "बड़े मियां छोटे मियां" का बॉक्स ऑफिस पर फ्लॉप होना? रिपोर्ट्स के मुताबिक, भगनानी को अपने ऑफिस तक बेचने पड़े थे। क्या खिलाड़ी कुमार की भारी-भरकम फीस इस समस्या का हिस्सा है? कुछ आलोचकों का कहना है कि उनकी ₹100 करोड़ की फीस फिल्मों के प्रदर्शन से मेल नहीं खाती।


लेकिन ठहरिए! भगनानी ने इन अफवाहों को नकार दिया है। उनका कहना है कि न तो कोई कर्ज है और न ही कर्मचारियों की छंटनी हुई है। तो फिर किस पर भरोसा करें? क्या यह उनकी आने वाली फिल्म के लिए पब्लिसिटी स्टंट है या सचमुच स्वर्ग में कोई समस्या है?


एक बात तो पक्की है, यह बॉलीवुड कहानी अब और भी मसालेदार हो रही है! ️ अधिक अपडेट के लिए जुड़े रहें!

#AkshayKumar #VashuBhagnani #FinancialTroubles #BollywoodNews.


 ప్రభాస్ నటించిన "కల్కి 2898 ఆడ్" రెండవ రోజు 43% పడిపోయింది, మొదటి రోజున రూ 54 కోట్ల ఆదాయం తెచ్చుకుంది. రెండు రోజుల మొత్తం కలిపి రూ 149.3 కోట్లను చేరుకుంది. పతనంతో కూడి ఉన్నప్పటికీ హిందీ ప్రేక్షకుల మద్దతు బలంగా ఉంది. ఈ రోజు ముగిసే నాటికి ఈ చిత్రం రూ 200 కోట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉంది.




credits to TheBlogger


రిలీజ్ రోజు, నాగ అశ్విన్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నటించిన "కల్కి 2898 ఆడ్" బాక్సాఫీస్‌ను రూ 95.3 కోట్ల కలెక్షన్‌తో రికార్డు చేసింది, ఇది భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద కలెక్షన్లలో ఒకటిగా నిలిచింది.


సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేమను అందుకుంది, ఉత్తర అమెరికా సర్క్యూట్ ప్రీమియర్ మరియు మొదటి రోజు కలిపి 5.5 మిలియన్ డాలర్లను సాధించింది. వీకెండ్ కలెక్షన్ 10 నుండి 12 మిలియన్ డాలర్లను దాటవచ్చని అంచనా. ఈ ఫీట్‌ని "బాహుబలి 2 - ది కన్‌క్లూజన్" తరువాత సాధించిన మొదటి చిత్రం అవుతుంది.


కానీ, ప్రారంభ జోరు తగ్గడంతో, సినిమా 43% పడిపోయి రూ 54 కోట్లను కలెక్ట్ చేసింది. తెలుగు వెర్షన్ రెండవ రోజు రూ 25.65 కోట్లు సాధించగా, మొదటి రోజు రూ 65.8 కోట్లను సంపాదించింది. హిందీ నెంబర్లు ముఖ్యమైనవి, రెండవ రోజు కూడా రూ 22.5 కోట్లు సాధించింది. వీకెండ్‌లో హిందీ మరియు తెలుగు కలెక్షన్లలో స్పైక్ ఆశించవచ్చు.

సినిమా రెండు రోజుల కలెక్షన్లు ఇప్పుడు రూ 149.3 కోట్లుగా ఉన్నాయి, తెలుగు నుండి రూ 91.45 కోట్లు, హిందీ నుండి రూ 45 కోట్లు, మిగతావి తమిళం, కన్నడ, మలయాళం భాషల నుండి వచ్చాయి. ఈ రోజు ముగిసే నాటికి సినిమా రూ 200 కోట్ల మార్క్‌ను దాటవచ్చని అంచనా.


ప్రధాన తారాగణం తో పాటు, ఎస్‌ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ వంటి ప్రముఖులు అతిథి పాత్రలలో కనిపిస్తారు.